నారాయణకు బెయిలు మంజూరు
చిత్తూరు (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణకు బెయిల్ లభించింది. వ్యక్తిగత పూచీకత్తుతో న్యాయమూర్తి సులోచనారాణి బెయిల్ మంజూరు చేశారు. ఏపీలో టెన్త్ ప్రవ్న పత్రాల లీక్ కేసులో పోలీసులు హైదరాబాద్‌లో మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను చిత్తూరు తరలించారు. నిన్న రాత్రి వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించిన అనంతరం నారాయణను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. సుదీర్ఘవాదనల అనంతరం పోలీసుల అభియోగాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు.
నారాయణకు బెయిల్ లభించిన అనంతరం ఆయన తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. 2014లోనే ఆ విద్యాసంస్థల అధినేతగా ఆయన వైదొలిగినట్లు నారాయణ తరఫున న్యాయవాది వెల్లడించారు. దాని సంబంధించిన డాక్యూమెంట్లను న్యాయమూర్తి సమర్పించినట్లు అడ్వకేట్ పేర్కొన్నారు. నేరారోపణ నమ్మే విధంగా లేవని జడ్జి అభిప్రాయానికి వచ్చినట్లు చెప్పారు. ఈ నెల 18వ తేదీలోగా రూ. లక్ష చొప్పున ఇద్దరి పూచీకత్తు ఇవ్వవాలని న్యాయమూర్తి ఆదేశించారని, నారాయణపై పోలీసులు అభియోగాలను నిరూపించలేదని న్యాయవాది అన్నారు.