NASA: అంగార‌కుడిపై ఆక్సిజ‌న్ త‌యారీ..

వాషింగ్ట‌న్‌ (CLiC2NEWS): అంగార‌కుడిపై ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి కోసం అమెరికా అంత‌రిక్ష సంస్థ (నాసా) చేప‌ట్టిన ప్ర‌యోగం విజ‌య‌వంతంమైంది. అరుణ గ్ర‌హంపై కార్భ‌న్ డై ఆక్సైడ్‌ను ఆక్సిజ‌న్‌గా మార్చే ప‌రీక్ష‌.. మాక్సీ (మార్స్ ఆక్సిజ‌న్ ఇన్‌-సిటు రిసోర్స్ యుటిలైష‌న్ ఎక్స్‌పెరిమెంట్) విజ‌య‌వంతమైన‌ట్లు సంస్థ వెల్ల‌డించింది. ఇక అంగార‌కుడిపైకి మాన‌వ స‌హిత యాత్ర‌ల‌కు మార్గం సుగ‌మం చేస్తుంద‌ని ట్విట‌ర్‌లో పేర్కొన్నారు.

మాక్సీ .. 2021లో అంగారకుడిపైకి దిగిన‌ప్ప‌టినుండి ఆక్సిజ‌న్‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. ఈ ప‌రిక‌రం ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 122 గ్రాముల ప్రాణ‌వాయువును త‌యారు చేసిన‌ట్లు స‌మాచారం. ఈ ఆక్సిజ‌న్ 98 శాతం స్వ‌చ్ఛ‌త‌తో ఉంది. దీంతో అంగార‌కుడిపైకి వెళ్లే వ్యోమ‌గాములు జీవించ‌డానికి, అక్క‌డి వ‌న‌రులు వినియోగించ‌డానికి వీలు క‌లుగుతుంద‌ని నాసా తెలిపింది. మాక్సీ ద్వారా ఉత్ప‌త్తి చేసిన ఆక్సిజ‌న్ ద్ర‌వీక‌రించి నిల్వ చేయ‌గ‌లిగే పూర్తిస్థాయి వ్య‌వ‌స్థ నిర్మాణంపై దృష్టి సారించిన‌ట్లు సంస్థ వెల్ల‌డించింది.

Leave A Reply

Your email address will not be published.