యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అవగాహనా కార్యక్రమం

పెద్ద‌ప‌ల్లి (CLiC2NEWS): రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వ‌ర్యంలో ట్రినిటి డిగ్రీ కాలేజ్‌, MJP రెసిడెన్సీయల్ స్కూల్ లో AHTU(యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్) అవగాహనా కార్యక్రమం నిర్వ‌హించారు. విమెన్ సేఫ్టీ వింగ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇంచార్జి ఎస్ఐ మౌనిక కార్య‌క్ర‌మంలో విద్యార్థులకు బాల్య వివాహాలు, ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా హరాస్మెంట్, అభయ యాప్, పొక్సో యాక్ట్, సైబర్ క్రైమ్స్, గృహ హింస, షీ టీమ్స్, భరోసా సెంటర్, బాల్య వివాహలు మరియు తదితర అంశాలపై విద్యార్థులకు అవ‌గాహ‌న క‌లిగించారు.

ఈ సందర్బంగా ఎస్ఐ మాట్లాడుతూ.. ముఖ్యంగా మహిళలపై చిన్నపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. యుక్తవయసులో ఉన్న తమ పిల్లల దైనందిన కార్యకలాపాలను ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండాలని, బాల్యవివాహలకు ప్రోత్సహించే తల్లిదండ్రులపై చట్టరీత్యా చర్యలు తీసుకొనబడతాయని తెలిపారు. సైబర్ నేరాల బారిన పడకుండా అందరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో మహిళల, విద్యార్థుల రక్షణ మరియు భద్రత కొరకు షీ టీమ్స్ పనిచేస్తున్నాయని ఏలాంటి ఆపద సమయం లోనైనా రామగుండం పోలీస్ కమిషనరేట్ షీ టీమ్ వాట్సాప్ నెంబర్ +91 63039 23700 పిర్యాదు చేయవచ్చ‌న్నారు. మంచిగా చదువుకొని భవిష్యత్తును తీర్చిదిద్దుకునేలా జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఆపదలో ఉన్నవారు టోల్ ఫ్రీ నంబర్స్ 1930,108,100,1098,181 లకు ఫోన్ చేసి పోలీసు మరియు ఇతర శాఖల యంత్రాంగం యొక్క సేవలు పొందాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.