సిబిఐ అధికారి పెద్దిరాజుకు జాతీయ పురస్కారం..

పశ్చిమ గోదావరి (CLiC2NEWS): సిబిఐ ప్రధాన కార్యాలయం సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డివిజన్లో డిప్యూటి పోలీసు సూపరెంటెండెంట్ గా పనిచేస్తున్న బండి పెద్దిరాజుకు కేంద్ర హోంమంత్రి మెడల్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అవార్డు లభించింది. 2019 సంవత్సరానికి గాను పెద్దిరాజు ఈ అవార్డు అందుకున్నారు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామనికి చెందినవారు. 1993లో సిబిఐ కానిస్టేబుల్‌గా చేరారు. 2008 వ సంవత్సరంలో ఇండియా ఉత్తమ దర్యాప్తు అధికారి గోల్డ్ మెడల్ సాధించారు. 2017 లో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్-ఐపిఎం, 2014, 2018 లో అత్యుత్తమ దర్యాప్తు అధికారి అవార్డులు సొంతం చేసుకున్నారు. 2019 డేటా సెక్యూరిటి కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎక్స్‌లెన్స్ అవార్డును అందుకున్నారు.