నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం.. కేసు నమోదు చేసిన సిబిఐ
సిబిఐకి నీట్ పేపర్ లీక్ కేసు

ఢిల్లీ (CLiC2NEWS): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నాపత్రం లీక్ అంశంలో విద్యాశాఖ ఆదేశాల మేరకు సిబిఐ కేసు నమోదు చేసింది. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష లో అక్రమాలు జరిగినట్ఉల వస్తున్న ఆరోపణలపై పూర్తి స్తాయి విచారణ చేపట్టనుంది. అంతేకాక బిహార్ పేపర్‌లీక్, పలుచోట్ల విద్యార్థుల సమయం కోల్పోయారని , వారికి గ్రేస్ మార్కులు కలపామన్న విషయంపై కూడా సమగ్రంగా విచారించనుంది.
దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. దీనిలో అవకతవకలు జరిగాయంటూ పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం సమగ్ర దర్ఆయప్తు చేసేందుకు సిబిఐకి అప్పగించాలని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.