NEET PG పరీక్షలు వాయిదా

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతన్న వేళ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పీజీ పరీక్షలను 4 నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఆయా రాష్ట్రా ప్రభుత్వాలు కీలకమైన టెన్త్, ఇంటర్ పరీక్షలు కూడా వాయిదా వేయగా ఇప్పుడు కోవిడ్ సెగ నీట్‌ను కూడా తాకింది.. దేశవ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ కల్లోలం నేపథ్యంలో నీట్ పీజీ పరీక్షలు వాయిదా పడ్డాయి. 4 నెలల పాటు నీట్ పీజీ పరీక్షలు వాయిదా వేస్తూ భారత ప్రధాని కార్యాలయం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితిలు, కరోనా కేసులపై సమీక్షించిన పీఎంవో. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం మంచిది కాదని భావించి 4 నెలల పాటు వాయిదా వేసింది. దీని వెనుక మరో కారణం కూడా ఉంది. ఎంబీబీఎస్ విద్యార్థులను కోవిడ్ సేవల్లో ఉపయోగించుకోవడానికే పిఎంవొ ఈ నిర్ణయం తీసుకుంది. 100 రోజులు కోవిడ్ విధుల్లో ఉన్న పిజి విద్యార్థులకు ప్రభుత్వ వైద్య నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది.