నీట్ యుజి 2024 కౌన్సెలింగ్ వాయిదా..

ఢిల్లీ (CLiC2NEWS): నీట్ యుజి కౌన్సెలింగ్ వాయిదా పడింది. కౌన్సెలింగ్ ప్రక్రియి శనివారం నుండి ప్రారంభం కావాల్సి ఉండగా.. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ()వాయిదా వేసింది. కొత్త తేదీలను కేంద్ర విద్యాశాఖ త్వరలో ప్రకటిస్తుందని తెలిపింది. దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కొరకు నిర్వహించిన నీట్ పరీక్ష వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నీట్ అభ్యర్థులలో 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం, ఓఎంఆర్ షీట్లు అందకపోవడం, న్యాయస్థాన పర్యవేక్షణలో దర్యాప్తు సహా నీట్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో దాదాపు 26 పిటిషన్లు దాఖలైయ్యాయి. ఉన్నత న్యాయస్థానం నీట్ కౌన్సెలింగ్ వాయిదా వేసేందుకు నిరాకరించింది.