Netflix: 28న ఒటిటిలోకి ‘లక్కీ భాస్కర్’..

హైదరాబాద్ (CLiC2NEWS): దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి నిర్మించిన ‘లక్కీభాస్కర్’ చిత్రం ఒటిటిలో విడుదల కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఒటిటి సంస్థ నెట్‌ప్లిక్స్ తాజాగా పోస్ట్ పెట్టింది. నవంబర్ 28 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం , మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. బ్యాంకింగ్ సెక్టార్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా దీపావళి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మహానటి, సీతారామం, తర్వాత తెలుగులో దుల్కర్ కు ఇది హ్యాట్రిక్ చిత్రం. ఆయన కెరీర్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రం లక్కీ భాస్కర్.