సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో శిశువు అపహరణ

సంగారెడ్డి (CLiC2NEWS): జిల్లా కేంద్ర ఆస్పత్రిలో శిశువు అపహరణకు గురైంది. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఓ శిశువును అపహరించిన ఘటన కలకలం రేపింది. మానూరు మండలం దూదిగొండకు చెందిన నసీమా అనే మహిళ ఆడశిశువును జన్మించింది. కొంతసేపటికే ఆ శిశువు కనిపించకుండా పోయింది. బాధిత మహిళ, ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఆస్పత్రిలోని సిసికెమెరాల ఆధారంగా ముగ్గురు మహిళలు ఆస్పత్రిలో అనుమానాస్పదంగా తిరగడం నమోదైంది. వారే శిశువును ఎత్తుకెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.