ఆర్‌టిసిలో కొత్త బ‌స్సులు!.. టికెట్ తీసుకోవాల్సిందే..

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ఆర్‌టిసిలో కొత్త ర‌కం సెమి డీల‌క్స్ బ‌స్సుల‌ను త్వ‌ర‌లో ప్రారంభించ‌నున్నారు. ఈ బ‌స్సుల్లో క‌నీస టికెట్ ధ‌ర రూ. 30. ఈ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం లేదు. ఎక్స్‌ప్రెస్‌, డీల‌క్స్ బ‌స్సుల‌కు మ‌ధ్య‌రంగా ఈ కొత్త స‌ర్వీసును ప్రవేశ‌పెడుతున్న‌ట్లు స‌మాచారం. ఆర్డిన‌రీ, ఎక్స్‌ప్రెస్ బ‌స్సుల్లో ప్ర‌య‌ణికుల‌ ర‌ద్దీని నియంత్రించేందుకు.. రోజువారీ ప్ర‌త్య‌క్ష ఆదాయం పెంచే దిశ‌గా వీటిని అందుబాటులోకీ తీసుకురావ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. మ‌హాలక్ష్మి ఉచిత ప్ర‌యాణ టికెట్ల మొత్తాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం చెల్లిస్తున్న‌ప్ప‌టికీ ఆర్‌టిసికి రోజువారీ ప్ర‌త్య‌క్షంగా వ‌చ్చే ఆదాయంపై భారీగా ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డింది. డ‌బ్బులు చెల్లించి టికెట్లు తీసుకునే ప్ర‌యాణికుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గింది. ఈ నేప‌థ్య‌లో కొత్త‌ర‌కం బ‌స్సుల‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని అర్‌టిసి నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.

Comments are closed.