India Corona: కొత్తగా 31,923 కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల వ్యవధిలో 31,923 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది.
- గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 282 మంది బాధితులు మరణించారు.
- ఇప్పటి వరకు దేశంలో మొత్తం మరణాలు 4,46,050కి పెరిగాయి.
- తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,35,63,421కి చేరింది.
- గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 31,990 మంది కోలుకున్నారు.
- ఇప్పటి వరకు దేశంలో 3,28,15,731 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
- ప్రస్తుతం దేశంలో 3,01,604 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
- దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 71,38,205 మందికి వ్యాక్సినేషన్ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది.
- ఇప్పటి వరకు మొత్తం 83,39,90,049 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.