వివాహ‌మైన కొన్ని గంట‌ల‌కే వ‌రుడు మృతి

నంద్యాల (CLiC2NEWS): జిల్లాలోని వెలుగోడు మండ‌ల ప‌రిధిలో విషాదం చోటు చేసుకుంది. వివాహ‌మైన కొన్ని గంట‌ల‌కే న‌వ వ‌రుడు అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందాడు. బోయ‌రేవుల గ్రామానికి చెందిన శివ‌కుమార్‌కు జూపాడు బంగ్లా మండ‌లంలోని భాస్క‌రాపురం గ్రామాన‌కి చెంద‌ని శిరీష‌తో వివాహం జ‌రిగింది. శ‌నివారం తెల్ల‌వారుజామున 3 గంట‌ల స‌మ‌యంలో వాకింగ్‌కు వళ్తున్నాన‌ని చెప్పి ఇంట్లో నుండి బ‌య‌ట‌కు వెళ్లాడు. కానీ.. శివ‌కుమార్ ఎంత‌సేప‌టికీ తిరిగి రాక‌పోవ‌డంతో కుటుంబ‌స‌భ్యులు వెత‌క‌డం ప్రారంభించారు. శివ‌కుమార్ రోడ్డు మీద ప‌డి ఉండ‌డాన్ని కుటుంబ‌స‌భ్యులు గుర్తించి, ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. శివ‌కుమార్ అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ‌స‌భ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు అనుమానాస్ప‌ద మృతిగా పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.