న‌గ‌రంలో డ్ర‌గ్స్ విక్ర‌యం.. నైజీరియ‌న్ అరెస్టు

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలోని పంజాగుట్ట‌లో డ్ర‌గ్స్ విక్ర‌యిస్తున్న నైజీరియ‌న్ ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గోవా కేంద్రంగా మాద‌క‌ద్ర‌వ్యాలను విక్ర‌యిస్తున్న నైజీరియ‌న్ దేశ‌స్థుడు స్టాన్లీని సోమ‌వారం అరెస్టు చేసిన‌ట్లు తెలిపారు. దేశ‌వ్యాప్తంగా చాలామందికి డ్ర‌గ్స్ విక్ర‌యిస్తున్న‌ట్లు గుర్తించామ‌న్నారు. నిందితుడి నుండి కోట్ల రూపాయ‌ల విలువ చేసే హెరాయిన్‌, కొకైన్‌, 9 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.