బంగ్లాదేశ్‌కు చెందిన నోబెల్ శాంతి బ‌హుమ‌తి గ్ర‌హీత‌కు జైలుశిక్ష‌..!

ఢాకా (CLiC2NEWS): నోబెల్ శాంతి బ‌హుమ‌తి గ్ర‌హీత మ‌హ‌మ్మ‌ద్ యూన‌స్‌కు న్యాయ‌స్థానం ఆరు నెల‌ల జైలుశిక్ష విధించింది. బంగ్లాదేశ్ కార్మిక చ‌ట్టాల‌ను ఉల్లంఘించిన కేసులో మ‌హ‌మ్మ‌ద్ యూన‌స్ తో పాటు ఆయ‌న‌కు చెందిన గ్రామీణ్ టెలికాం సంస్థ‌కు చెందిన ముగ్గురు వ్య‌క్తుల‌ను దోషులుగా తేల్చింది. యూన‌స్ 2006లో నోబెల్ శాంతి బ‌హుమ‌తిని అందుకున్నారు. మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా ల‌క్ష‌లాది ప్ర‌జ‌ల‌ను పేద‌రికం నుండి బ‌య‌ట ప‌డేశార‌నే ఘ‌న‌త‌ను సాధించారు. కానీ.. బంగ్లా ప్ర‌ధాని నుండి యూన‌స్ తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు.

పేద‌ల‌కు స్వ‌యం ఉపాధి నిమిత్తం కొద్ది మొత్తాల‌ను అందించ‌డం, మ‌హిళా సాధికార‌త కోసం యూన‌స్ గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేశారు. కానీ.. పేద‌ల రక్తాన్ని వ‌డ్డీల రూపంలో పీలుస్తున్నారంటూ ఆ దేశ ప్ర‌ధాని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

Leave A Reply

Your email address will not be published.