క‌రోనా వ్యాక్సిన్ల త‌యారీకి మార్గం చూపిన శాస్త్రవేత్త‌ల‌కు నోబెల్ అవార్డు

స్టాక్‌హోం (CLiC2NEWS): వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసిన కాటిన్ క‌రికో, డ్రూ వెయిస్‌మ‌న్‌కు ఈ సంవ‌త్స‌రం (2923) నోబెల్ పుర‌స్కారం ల‌భించింది. వీరు వైద్య‌శాస్త్రంలో చేసిన ఆవిష్క‌ర‌ణ‌లు కొవిడ్ మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ల అభివృద్ధి లో కీల‌క భూమిక పోషించినందుకు గానూ వీరిద్ద‌రికి నోబెల్ ను ప్ర‌క‌టించారు. న్యూక్లియోసైడ్ బేస్ మాడిఫికేష‌న్ల‌లో వీరు చేసిన ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ప్ర‌తిఫ‌లంగా స్వీడ‌న్‌లోని స్టాక్‌హోంలో ఉన్న క‌రోలిన్‌స్కా ఇన్స్టిట్యూట్‌లోని నోబెల్ బృందం సోమ‌వారం ఈ పురస్కారాన్ని ప్ర‌క‌టించింది.

వీరిలో కాట‌లిన్ క‌రికో హంగేరికి చెందిన‌వారు. కాగా డ్రూవెయిస్ మ‌న్ అమెరికాకు చెందిన వారు. వీరు వ‌ర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ప‌రిశోధ‌న‌లు జ‌రిపారు. వీరి ఇద్ద‌రి కృషితో ఎంఆర్ ఎన్ ఎ వ్యాక్సిన్ల‌ను క‌ణాల్లోకి పంపిన‌ప్పుడు అవి ప్ర‌తిచ‌ర్య‌ను అడ్డుకోవ‌డంతో పాటు శ‌రీరంలో ప్రోటీన్ల ఉత్ప‌త్తిని పెంచుతాయ‌ని వీరు గుర్తించారు. 2005 వ సంవ‌త్స‌రంలో వీరి ప‌రిశోధ‌న‌ల‌పై ఒక పేప‌ర్‌ను కూడా ప‌బ్లిష్ ఏశారు. కానీ వీరి ప‌రిశోధ‌న‌ల అప్ప‌ట్లో పెద్ద ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకోలేదు. కానీ వీరి ప‌రిశోధ‌న‌ల ఫ‌లితంగానే 2020లో ప‌లు వ్యాక్సిన్ల‌కు ప్ర‌భుత్వాల నుంచి ఆమోదం ల‌భించింది. దాంతోనే కోట్లాది మంది ప్రాణాల‌ను కాపాడ‌గలిగామ‌ని నోబెల్ బృందం ప్ర‌క‌టించింది.

Leave A Reply

Your email address will not be published.