విజయవాడలో రహదారులు జలమయం..
విజయవాడ (CLiC2NEWS): నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుండి వర్షం కురుస్తోంది. నగరవాసులంతా వేసవి వర్షాన్ని ఆస్వాదిస్తున్నా.. లోతట్ట ప్రాంతాలలో భారీగా నీరు చేరు పలువురు ఇబ్బందులు పడుతున్నారు. రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. బెంజి సర్కిల్, ఏలూరు రోడ్ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురవడంతో 19 గ్రామాలకు రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాల్లోకి నీరు చేరి చెరువలను తలపిస్తున్నాయి.