మాద‌క ద్ర‌వ్యాల కేసులో సినీన‌టుడు న‌వ‌దీప్‌కు నోటీసులు

హైద‌రాబాద్ (CLiC2NEWS): డ్ర‌గ్స్‌కేసులో నార్కోటిక్ విభాగం పోలీసులు సినీన‌టుడు న‌వ‌దీప్‌కు నోటీసులు జారీ చేశారు. సెప్టెంబ‌ర్ 23వ తేదీ బ‌షీరాబాగ్‌లోని ఎసిబి కార్యాల‌యంలో విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని పేర్కొన్నారు. మాద‌క ద్ర‌వ్యాలు విక్ర‌యించే రాంచంద‌ర్‌తో న‌వ‌దీప్‌కు ఉన్న ప‌రిచ‌యాల‌పై నార్కొటిక్ పోలీసులు ఆధారాలు సేక‌రించారు. మాదాపూర్ డ్ర‌గ్స్ కేసులో ఇప్ప‌టివ‌ర‌కు పోలీసులు 11 మందిని అరెస్టు చేసిన‌ట్లు స‌మాచారం. వాట్సాప్ చాటింగ్‌, కాల్ డేటాను సేక‌రించి వాటి ఆధారంగా న‌వ‌దీప్‌ను ప్ర‌శ్నించ‌నున్న‌ట్లు స‌మాచారం.

1 Comment
  1. […] మాద‌క ద్ర‌వ్యాల కేసులో సినీన‌టుడు న‌… […]

Leave A Reply

Your email address will not be published.