ఇస్రోలో 526 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌..

ఢిల్లీ (CLiC2NEWS): ఇండియ‌న్ స్పేస్ రిసెర్చ్ ఆర్గ‌నైజేష‌న్ (ఇస్రో) దేశ‌వ్యాప్తంగా ప‌లు చోట్ల ఖాళీగా ఉన్న 526 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. హైద‌రాబాద్‌, శ్రీ‌హ‌రికోట‌ల‌తో పాటు ప‌లు చోట్ల అసిస్టెంట్లు, జూనియ‌ర్ ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్లు, యుడిసి, స్టెనోగ్రాఫ‌ర్ల పోస్టుల భ‌ర్తీకోసం ఇస్రో రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఐసిఆర్‌బి) ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తుంది. ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థులు 28 ఏళ్ల వ‌య‌సులోపు వారై ఉండాలి. అభ్య‌ర్థులు క‌నీసం 60% మార్కుల‌తో లేదా క‌నీసం 6.32 సిజిసిఎతో గ్రాడ్యుయేష‌న్ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణ‌త సాధించడంతో పాటు కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాల‌ని సూచించింది. డిసెంబ‌ర్ 20వ తేదీ నుండి జ‌న‌వ‌రి 9వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తారు.

హైద‌రాబాద్‌లో మొత్తం 54 పోస్టులు ఉండ‌గా.. శ్రీ‌హరికోట‌లో  78 పోస్టులు ఉన్నాయి. బెంగ‌ళూరులో 215, అహ్మ‌దాబాద్‌లో 31, హ‌స‌న్ 17, ఢిల్లీలో 2 పోస్టులు, తిరువ‌నంత‌పురంలో 129 పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. పూర్తి వివ‌రాల‌కు అభ్య‌ర్థులు https://www.isro.gov.in/ వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

2 Comments
  1. gate.io omi migration says

    Hi my friend! I wish to say that this article is awesome, nice written and come with almost all significantinfos. I would like to see extra posts like this .I know this web site presents quality dependent articles or reviewsand additional data, is there any other web page which gives these kinds ofinformation in quality?I do not know whether it’s just me or if perhaps everybody else experiencing issues with yoursite. It appears as though some of the written text in your posts are running off the screen. Can someone else please provide feedback and letme know if this is happening to them as well? This might be a problem with my browser because I’ve had this happen before.Cheers

  2. binance says

    Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?

Leave A Reply

Your email address will not be published.