రాష్ట్రంలో నవంబర్ 30న వేతనంతో కూడిన సెలవు..
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 30వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 30 న కర్మాగారాలు, దుకాణాలు, పరిశ్రమల్లో పనిచేసే సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ ప్రకటించింది. ఈ నెల 29,30వ తేదీలలో ప్రభుత్వ పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించనున్నట్లు సమాచారం. ఎందుకంటే 29నే ఆయా పోలింగ్ కేంద్రాలకు ఉద్యోగులు చేరుకోవాల్సి ఉంటుంది.