Khammam: పేద‌ల విద్యార్థుల చ‌దువుకు ఎన్నారైల చేయూత

ఖ‌మ్మం (CLiC2NEWS): ఫిలిడేల్పియా తెలంగాణ అసోసియేషన్ నిరుపేద‌లైన ముగ్గురు బాలిక చ‌దువుకు చేయూత నందించారు. శుక్ర‌వారం సోషల్ వెల్ఫేర్ బాలికల జూనియర్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ఫిలిడేల్పియా తెలంగాణ అసోసియేషన్ సహకారంతో D.సౌజన్య వైద్య విద్యార్థికి రూ. 1,50,000 లను, కృష్ణ ప్రసాద్ నలజాల సహాయంతో M. Sc ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుచున్న కావ్యకు రూ.10,000 లను, D.భావన నర్సింగ్ విద్యార్థినికి రూ.25,000 మొత్తం ముగ్గురి ఉన్నత చదువులకు ఆర్థిక సహాయాన్ని అందించారు.

అలాగే మూడు వందల పైగా బాలికలున్న ఈ కళాశాలలో కేవలం ఇరవై కంప్యూటర్లతో కూడిన విద్యార్థుల అవసరాలు తీర్చలేక పోతున్నదని కళాశాల ప్రిన్సిపాల్ ఈ సంద‌ర్భంగా వారి దృష్టికి తీసుకొచ్చారు. మరో ఇరవై కంప్యూటర్ల కేంద్రం ఏర్పాటుకు స‌హాయం చేయ‌మ‌ని కోరారు. దానికి ఎన్నారై ఫాండేషన్ కోర్ కమిటీ త్వరలో ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.

ఈ కార్యక్రమంలో NRI ఫౌండేషన్ USA కోర్ కమిటీ చైర్మన్ బయ్యన బాబురావు, DCO శ్రీమతి ప్రత్యూష , NRI ఫౌండేషన్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు శ్రీ బోనాల రామకృష్ణ ,బండి నాగేశ్వరరావు,ట్రెజరర్ పసుమర్తి రంగారావు ,సభ్యులు వాసిరెడ్డి శ్రీనివాసరావు ,అర్జున్ రావు ,కృష్ణరావు, రాజేశ్వరి, యోగ గురువులు భాహర్ అలీ, కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి , ప‌లువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.