Hyderabad: పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని పంజాగుట్ట స్మశాన వాటిక ఎదురుగా రోడ్డు విస్తరణ పనులు జరగనున్నందున అక్కడ ఉన్న 1000 ఎంఎం డయా ఎయిర్ వాల్వ్‌ను మరోచోటకు మార్చాల్సి ఉంది. దీంతో పాటు సఫ్దార్ నగర్ సమీపంలోని నాలా క్రాసింగ్ వద్ద 1000 ఎంఎం డయా పీఎస్‌సీ పైప్‌లైన్‌ను 1000 ఎంఎం డయా ఎంఎస్ పైప్‌లైన్‌గా మార్చాల్సి ఉంది.
కావున, తేదీ: 15.11.2021, సోమవారం ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు అనగా తేదీ: 16.11.2021, మంగళవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి. కాబట్టి ఈ 24 గంటల వరకు జలమండలి ఓఆండ్ఎమ్ డివిజన్ – 6, డివిజన్ – 9 పరిధిలోని పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
1. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 6 – ఎర్రగడ్డ, బంజారాహిల్స్, ఎల్లారెడ్డిగూడ, ఎస్ఆర్‌నగర్, వెంగళ్‌రావునగర్, సోమాజిగూడ, వెంకటగిరి సెక్షన్‌ల పరిధిలోని ప్రాంతాలు.
2. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 9 – మూసాపేట సెక్షన్ పరిధిలోని పాండురంగనగర్, కబీర్‌నగర్ ప్రాంతాలు.
కావున నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరడమైనది.