బాలల దినోత్సవం సందర్భంగా.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పోటీలు

నవభారత లైయన్స క్లబ్ కన్వీనర్ డా.హిప్నో పద్మా కమలాకర్

హైద‌రాబాద్ (CLiC2NEWS): నవంబర్ 14న పిల్లల దినోత్సవం సందర్భంగా నవభారత్ లైయన్స క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెమొరి, ఆటలు, పాటల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆ క్లబ్ ఉపాధ్యక్షులు గోపాల్ కృష్ణ, కన్వీనర్ డా.హిప్నో పద్మా కమలాకర్, తెలిపారు. డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో గురువారం మీడియాతో మాట్లాడారు. .. కొవిడ్ 19తో 2 సంవత్సరాల నుంచి పిల్లలు ఒత్తిడితో సతమతం అవుతున్నారని అన్నారు. అందుకే పిల్లలు ఆరోగ్యంగా ఉండటం కొసం నవభారత లైయన్స క్లబ్ సిటి మోడల్ ప్రైమరీ స్కూల్ లో ఈ పోటిలను నిర్వహిస్తుందని తెలిపారు. బుధవారం పిల్లలకు బహుమతులను క్లబ్ అధ్యక్షుడు జె.టి.విద్యా సాగర్ అందజేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ ఎన్.రామ్ ప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శి వి.జె.క్యార్లిన్, కోశాధికారి బి.వి.రామయ్య, 2వ ఉపాధ్యక్షులు ఎన్.వి.సుబ్బారావు క్లబ్ సభ్యులు కూడా పాల్గొంటారని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.