రేషన్ దుకాణాల్లో మరో కిలో బియ్యం అదనంగా పంపిణీ..
![](https://clic2news.com/wp-content/uploads/2023/04/KILO-RICE-EXTRA-NOW-ONWARDS.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): రేషన్ దుకాణాల్లో ఏప్రిల్ నెల నుండి కిలో బియ్యం అదనంగా ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు ఇస్తున్న 5 కిలోలకు బదులు.. ఆరు కిలోల చొప్పున పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కిందటి సంవత్సరం డిసెంబర్ వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి యూనిట్ (తల)కు 10 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. ఈ ఏడాది జనవరి నుండి డిసెంబర్ వరకు 5 కిలోలు మాత్రమే పంపిణీ చేశారు. దీనికి అదనంగా మరో కిలో చొప్పున పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.