ఖమ్మం జిల్లాలో ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి

ఖమ్మం (CLiC2NEWS): జిల్లాలోని నేలకొండపల్లి మండలంలో ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని మంగాపురం తండా వద్ద మహిళా కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతిచెందారు. ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.