ఒక్క ఫోన్‌చేస్తే చాలు.. ఇంటికే వైద్యసేవలు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్(CLiC2NEWS): ఒక్క ఫోన్‌కాల్‌తో ఇంటికి వచ్చి కరోనా వైరస్‌కు చికిత్స అందిస్తామని ఎక్సైజ్ శాఖామంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి సర్వే చేపట్టిన విషయం తెలిసినదే. ఇంటింటా ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మంత్రి జిల్లా కేంద్రంలోని ఏనుగొండలో ప్రతీ ఇంటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడి ప్రజల ఆరోగ్య సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలు కరోనా పట్ల భయపడాల్సిన అవసరం లేదని, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.