ఒంగోలు భూ కబ్జా కేసు.. 572 నకిలీ పత్రాలు సీజ్
Ongole land acquisition case.. 572 fake documents seized
బంగోలు (CLiC2NEWS): ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇటీవల వెలుగులోకి వచ్చిన భూ కబ్జాలపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు. దీని కోసం సిట్‌ను ఏర్పాటు చేసినట్లు .. వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
భూకబ్జాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు సోదాలు నిర్వహించగా.. లాయర్ పేటలోని ఓ ఇంట్లో పూర్ణచంద్రరావు అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. మీ సేవలో లభించే పత్రాలకు నకిలీ స్టాంపులు సృష్టించి ఫోర్జరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. 123 నకిలీ డాక్యుమెంట్లు, 25 నకిలీ స్టాంపులు సీజ్ చేసినట్లు సమాచారం. సిట్ ఏర్పాటు చేసిన అనంతరం ఇప్పటి వరకు 572 నకిలీ పత్రాలు.. 1200 జ్యుడీషియల్, నాన్ జ్యుడిషియల్ పత్రాలు స్వాధీనం చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 72 మందిని నిందితులను గుర్తించారు. 38 మందిని అరెస్టు చేయగా.. మరో 40 మందిని త్వరలో అరెస్టు చేయనున్నట్లు తెలిపారు. ఈ తరహా భూ కబ్జాలు 10- 12 సంవత్సారాలనుండి జరుగుతుందన్నారు. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న స్థాలలకు నకిలీ పత్రాలతో భూకబ్జాలకు పాల్పడుతున్నట్లు ఎస్‌పి మలికా గార్గ్ వెల్లడించారు.