మంచిర్యాల పట్టణ టిఎన్జీవోస్ కార్యాలయం ప్రారంభం

మంచిర్యాల (CLiC2NEWS): జిల్లా కేంద్రంలో శుక్రవారం తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్ యూనియన్ పట్టణ కార్యాలయాన్ని టిన్జీవోస్ జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి, జిల్లా కార్యదర్శి బి. రాంమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గడియారం శ్రీమరి మాట్లాడుతూ.. టిఎన్జీవోస్ సంఘానికి మరింత సేవలు అందించాలని కోరారు. అలాగే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి సంఘం బలోపేతానికి కమిటీ సభ్యులు కృషి చేయాలని మంచిర్యాల పట్టణ అధ్యక్షులు నాగుల గోపాల్, కార్యదర్శి ప్రభులింగం కు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పొన్న మల్లయ్య, జిల్లా నాయకులు బి. ప్రకాష్, సునిత, వెంకట కృష్ణ, సత్యనారాయణ, ప్రభు, శ్రీనివాస్, భాగ్యలక్ష్మి కెజియారాణితో మంచిర్యాల పట్టణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.