ఇంట‌ర్మీడియ‌ట్ అర్హ‌త‌తో ర‌క్ష‌ణ రంగంలో కొలువులు

 

బిఎ/ బిఎస్‌సి/ బిటెక్‌ ఉచితంగా చ‌దువుతూ త్రివిధ ద‌ళాల్లో లెవెల్-10 హోదాలో విధుల్లో చేరే అవ‌కాశం. దీనికి విద్యార్థినులు కూడా అర్హులే. నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మి (ఎన్‌డిఎ) అండ్ నేవ‌ల్ అకాడెమి (ఎన్ఎ) ప‌రీక్ష‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ మేరకు యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యుపిఎస్‌సి) ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తోంది. ఇంట‌ర్ ఉత్తీర్ణులైన‌వారు, ఇంట‌ర్ ద్వితీయ సంవ‌త్స‌రం చ‌దువుతున్న వారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. డిసెంబ‌ర్ 31 లోపు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. జులై 2, 2006 నుండి – జులై 1, 2009 మ‌ధ్య జ‌న్మించిన వారు అర్హులు. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ. 100గా నిర్ణ‌యించారు. మ‌హిళ‌ల‌కు, ఎస్‌సి, ఎస్‌టిల‌కు ఫీజు మిన‌హాయించారు.

నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడెమిలో 370, నేవ‌ల్ అకాడెమిలో (10+2 క్యాడెట్ స్కీమ్‌)లో 36 ఖాళీలు ఉన్నాయి. ఎన్‌డిఎ లో ఆర్మీకి 208 ఉండ‌గా.. మ‌హిళ‌ల‌కు 10 ఖాళీలు ఉన్నాయి. నేవీ 42 ఉండ‌గా.. మ‌హిళ‌ల‌కు 6 ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్‌-ఫ్ల‌యింగ్ 92 ఉండ‌గా,, మ‌హిళ‌ల‌కు 2 ఉన్నాయి. గ్రౌండ్ డ్యూటి టెక్ 18 ఉండ‌గా..మ‌హిళ‌ల‌కు 2, గ్రౌండ్ డ్యూటి నాన్‌టెక్ 10 ఉండ‌గా.. మ‌హిల‌కు 2 కేటాయించారు.

నేవ‌ల్ అకాడెమీలో 36 ఖాళీలు ఉండ‌గా.. మ‌హిళ‌ల‌కు 5 కేటాయించారు.

ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ఉచిత వ‌స‌తి, భోజ‌నం, దుస్తులు ఉంటాయి. కోర్సు పూర్తి చేసిన వారికి జెఎన్‌యు, న్యూఢిల్లీ డిగ్రీలు ప్ర‌దానం చేస్తారు. అనంత‌రం ఎంపికైన విభాగాల ట్రేడ్ శిక్ష‌ణ ఏడాది నుండి 18 నెల‌లు ఇస్తారు. ఈ శిక్ష‌ణ స‌మ‌యంలో ప్ర‌తి నెల రూ.56,100 స్టైపెండ్ అందుతుంది. శిక్ష‌ణ త‌ర్వాత ఉద్యోగంలోకి తీసుకుంటారు. లెవెల్ 10 లో విధులు నిర్వ‌హించాల్సి ఉంటుంది. మూల‌వేత‌నం రూ. 56,100 చెల్లిస్తారు. దినికి మిల‌ట‌రీ స‌ర్వీస్ పే రూ. 15,500 అద‌నం, డిఎ, హెచ్ఆర్ఎ, ప‌లు ప్రోత్సాహ‌కాలు అంద‌రికీ ఉంటాయి. అర్మిలో లెప్టినెంట్‌, నేవీలో స‌బ్ లెప్టినెంట్ , ఎయిర్‌ఫోర్స్‌లో ప్లయింగ్‌/ గ్రౌండ్ డ్యూటి అఫీస‌ర్ హోదాలు కేటాయిస్తారు. రెండేళ్ల అనుభ‌వంతో మొద‌టి సారి, ఆరేళ్ల అనుభ‌వంతో రెండోసారి, ప‌ద‌మూడేళ్ల అనుభ‌వంతో మూడోసారి ప‌దోన్న‌తి ద‌క్కుతుంది. ప‌ద‌మూడేళ్ల అనుభ‌వంతో ఆర్మి , నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో వ‌రుస‌గా.. లెప్టినెంట్ ల్న‌ల్‌, క‌మాండ‌ర్‌, వింగ్ క‌మాండ‌ర్ స్థాయికి చేరుకుంటారు. ప్ర‌తిభ ఆధారంగా భ‌విష్య‌త్తులో సంబంధిత విభాగాల్లో త్రివిధ ద‌ళాల‌కు అధిప‌తి కాగ‌ల‌రు.

 

 

Leave A Reply

Your email address will not be published.