పబ్బుల్లో డ్రగ్స్ వినియోగిస్తే యాజమాన్యాలదే బాధ్యత: మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని పబ్బుల యాజమాన్యాలతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు.పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం ఆరోపణలు, శబ్ధ కాలుష్యంపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పబ్బుల్లో డ్రగ్స్ వినియోగిస్తే యాజమాన్యులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు పబ్బుల్లో నిర్వహించే కార్యకలాపాలు యాజమాన్యాలు గమనించాలన్నారు. కార్యకలాపాలను గమనించకపోతే పబ్బులను మూసివేయాలని ఆదేశించారు. శబ్డ కాలుష్యంతో ప్రజలకు ఇబ్బంది కలుగజేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పబ్బులు పాటించాల్సిన నియమాలు , అధికారుల చర్యలపై పలు సూచనలు చేశారు.