ఆపరేషన్ సిందూర్‌పై పాకిస్థాన్ ప్రధాని స్పందన..!

లాహోర్ (CLiC2NEWS): భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరిఫ్ తొలిసారి స్పందించారు. తమ దేశంపై జరిగిన దాడులక ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. దీనికి ధీటుగా సమాధనం ఎలా ఇవ్వాలో తమ దేశానికి , తమ బలగాలకు తెలుసన్నారు. పాక్ సాయధ దళాలకు దేశం మొత్తం అండగా నిలుస్తుందన్నారు. మనం వెనక్కి తగ్గుతున్నామని భారత్ భావిస్తుందని.. కానీ, తమది ధైర్యవంతుల దేశమని వారు మరచిపోయారన్నారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్.. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్థాన్ అప్రమత్తమై దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా 48 గంటల పాటు గగనతలాన్ని మూసివేసినట్లు ప్రకటించింది. కానీ, బుధవారం సాయంత్రానికి ప్రధాన మార్గాల్లో విమాన రాకపోకలను పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. పంజాబ్ , ఇస్లామాబాద్ లో విద్యాసంస్థలు మూసివేసింది. భారత్ జరిపిన దాడుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారని.. 46 మందికి గాయాలయ్యాయని పాకిస్థాన్ ఇంటర్ సర్వాసెస్ పబ్లిక్ రిలేషన్ ( ఐఎస్పిఆర్) డైరెక్టర్ జనరల్ వెల్లడించినట్లు సమాచారం.