Palwancha: సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. ట్రాన్స్‌ఫార్మర్లు దగ్ధం

కొత్తగూడెం (CLiC2NEWS): జిల్లాలోని పాల్వంచ మండలం సీతారాంపట్నం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మంగళవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో విద్యుత్ ఉపకేంద్రంలోని ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదవశాత్తు పేలిపోయాయి. దాంతో భారీగా మంటల ధాటికి మూడు ట్రాన్స్‌ఫార్మర్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.