పవన్‌కల్యాణ్‌కు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి..

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈనెల 12న ఎపి ముఖ్యమంత్రిగా చంద్రబాబు తో పాటు మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. సిఎంగా చంద్రబాబు నిన్న బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం చంద్రబాబు మంత్రలకు శాఖలు కేటాయించారు. ఈ మేరకు జాబితాను విడుదల చేశారు. పవన్‌కల్యాణ్‌కు డిప్యూటి సిఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు. నారా లోకేశ్‌కు హెచ్ ఆర్‌డి, ఐటి, ఆర్‌టిజి శాఖలు.. కింజరాపు అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖ కేటాయించారు.
మంత్రలు వారికి కేటాయించిన శాఖలు:
చంద్రబాబు – ముఖ్యమంత్రి సాధారణ పరిపాలన, శాంతిభద్రతలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్
జనసేన
పవన్ కల్యాణ్ – డిప్యూటి సిఎం, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి
నాదెండ్ల మనోహర్ – ఆహార , పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు
కందుల దుర్గేశ్ – పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫి
బిజెపి
సత్యకుమార్ యాదవ్ – ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మరియు వైద్యవిద్య
టిడిపి
నారా లోకేశ్ హెచ్ ఆర్‌డి, ఐటి, ఆర్‌టిజి
కింజరాపు అచ్చెన్నాయుడు – వ్యవసాయ శాఖ
వంగలపూడి అనిత – హోం మరియు విపత్తు నిర్వహణ
కొల్ల రవీంద్ర – గనులు, భూగర్భ శాఖ అబ్కారి
పి. నారాయణ – పురపాలక మరియు పట్టాణాభివృద్ది
ఎస్. రామానాయుడు – జలవనరుల అభివృద్ది
ఎస్.ఎమ్.డి ఫరూక్ – లా మరియు జస్టిస్, మైనారిటి సంక్షేమం
ఎ. రామనారాయణ రెడ్డి – దేవాదాయ శాఖ
పయ్యావుల కేశవ్ – ఆర్ధిక శాఖ ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు అసెంబ్లీ వ్యవహారాలు
అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ , స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్
కొలుసు పార్థ సారథి – గృహ, సమాచార పౌర సంబంధాలు
బాల వీరాంజనేయస్వామి – సాంఘిక సంక్షేమం: ద దివ్యాంగులు, వయోవృద్దుల సంక్షేమంఫ సచివాలయం మరియు విలేజ్ వాలంటీర్
గొట్టిపాటి రవి- విద్యుత్ శాఖ
జి. సంద్ధారాణి – మహిళా , శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం
బిసి జనార్ధన్‌రెడ్డి – రోడ్డు భవనాల శాఖ , మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు
టిజి భరత్ – పరిశ్రమలు మరియు వాణిజ్యం , ఆహారశుద్ధి
ఎస్. సవిత – బిసి సంక్షేమం, ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం.. హ్యాండ్లూమ్స్ మరియు టెక్స్‌టైల్స్
వాసంశెట్టి సుభాష్ – కార్మి కార్మాగార బాయిలర్స్ మరియు వైద్య బీమా సేవలు
కొండపల్లి శ్రీినవాస్ – ఎంఎస్ ఎంఇ .. సెర్ప్.. ఎన్ ఆర్ ఐ సాధికారత మరియు సంబంధాలు
ఎం. రామ్‌ప్రసాద్ రెడ్డి – రావాణా యువజన మరియు స్పోర్ట్స్