రాజమహేంద్రవరం పేపర్ మిల్లు కార్మికులకు అన్యాయం జరగనివ్వం: సిఎం
అమరావతి (CLiC2NEWS): రాజమహేంద్రవరం పేపర్‌మిల్లు కార్మికుల వేతన సవరణ విషయమై పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సిఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. పేపర్ మిల్లు యాజమాన్యం, కార్మికులకు మధ్య ఉన్న సమస్య వివరాలను సిఎంకు విన్నవించారు. వేతన సవరణ సమస్యకు పరిష్కారం దొరికేలా చూడాలని కోరారు. సమస్యను పరిష్కరించి.. కార్మికులకు అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో కార్మికులకు అన్యాయం జరగకుండా చూస్తానని సిఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపి పురందేశ్వరి, మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ తదితరులు సిఎంను కలిశారు.