Manthani: రాష్ట్రవ్యాప్త సమ్మె ను జయప్రదం చేయండి..
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యం రావు

మంథని (CLiC2NEWS): అక్టోబర్ 8న జరిగే రాష్ట్ర వ్యాప్త సమ్మె జయప్రదం సదస్సు సి.ఐ.టి.యు. జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేష్ అధ్యక్షతన మంథని మున్సిపాలిటీ ఆవరణంలో జరిగింది. ఈ సందర్భంగా సి. ఐ. టి యు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా కూడా రాష్ట్రాన్ని ఏలుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్ కాలం నాటి జీవో లాను కొనసాగిస్తుందని అన్నారు. 73 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో దశాబ్ద కాలం నడిచిన కొత్త జీవోలు విడుదల చేయకుండా కార్మికులకు విమర్శించారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గత 100 ఏండ్లుగా కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్ గా మార్చి కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టిందని అన్నారు. దేశ సహజ వనరులను ప్రజా సంపద ప్రభుత్వరంగ సంస్థలను విదేశీ స్వదేశీ కార్పొరేట్లకు తెగనమ్ముతుంది అని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక దేశ వ్యతిరేక విధానాలను ప్రతిఘటించేందుకు 73 షెడ్యూల్డ్ జీవోలను పరిశ్రమల సాధించేందుకు రాష్ట్ర వ్యాప్త సమ్మె లో కార్మికవర్గం పెద్ద మొత్తంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వడ్లకొండ రాజయ్య, సింగారపు గట్టయ్య, మల్లేష్, శ్రవణ్ సతీష్ ,చందు ,రాజయ్య, కమల ,చుక్కమ్మ, తదితరులు పాల్గొన్నారు.