ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి..
నిందితుడిని అరెస్టు చేయండి: సిఎం చంద్రబాబు నిందితుడిని అరెస్టు చేయండి: సిఎం చంద్రబాబు

బద్వేల్ (CLiC2NEWS): కడప జిల్లా బద్వేలులో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ దుండగుడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని స్థానికులు కడప రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ పేరుతో తమ కుమార్తెను 8వ తరగతి నుండి విఘ్నేశ్ వేధిస్తున్నాడిన యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అతనికి వివాహం కూడా జరిగిందని, అయినా వేధింపులు ఆపలేదని, ఇవాళ పెట్రోల్ పోసి నిప్పంటించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సిఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలన్నారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థినికి, విఘ్నేశ్‌కు చిన్నప్పటి నుండి పరిచయం ఉంది. ఇద్దరూ బద్వేలు రామాంజేయనగర్‌కు చెందినవారేనని పోలీసులు తెలిపారు. తనను కలవాలని విద్యార్థినికి విఘ్నేశ్ ఫోన్ చేశాడు. కలవకపోతే చనిపోతానని బెదిరించి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని తెలిపారు. పరారీ లో ఉన్న నిందితుడి ఆచూకీ కోసం నాలుగు బృందాలతో గాలింపు చేపట్టారు. 80శాతం గాయాలై కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినుండి జిల్లా జడ్డి వాంగ్మాలం నమోదు చేసినట్లు సమాచారం.
[…] ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి… […]