ఎపిలో మార్పు తీసుకొస్తాం: ప‌వ‌న్‌క‌ల్యాణ్

నెల్లిమ‌ర్ల (CLiC2NEWS): విజ‌య‌న‌గ‌రం జిల్లా నెల్లిమ‌ర్ల మండ‌లం పోలిప‌ల్లిలో నిర్వ‌హించిన యువ‌గ‌ళం-న‌వ‌శ‌కం స‌భ‌లో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఎపిలో మార్పు తీసుకొస్తామ‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ను ఇంటికి పంపిస్తామ‌న్నారు. ప్ర‌జ‌లు క‌ష్ట‌సుఖాలు తెలుసుకోవ‌డం, పాద‌యాత్ర వ‌ల‌న చాలా అనుభ‌వాలు ఎదుర‌వుతాయ‌ని, యువ‌గ‌ళం పాద‌యాత్ర లోకేశ్ దిగ్విజ‌యంగా పూర్తి చేయ‌డం ఆనందంగా ఉంద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్నారు.
నాలుగు ద‌శాబ్దాల సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న వ్య‌క్తిని జైల్లో పెట్ట‌డం చాలా బాధ క‌లిగించింద‌ని, ఏదో ఆశించి ఆయ‌న‌కు మ‌ద్ద‌తివ్వలేద‌ని.. సాటి మ‌నిషి క‌ష్టాల్లో ఉన్న‌పుడు నావంతు సాయంగా ఉండాల‌నే మ‌ద్ద‌తిచ్చాన‌న్నారు. సోనియాగాంధీ.. జ‌గ‌న్ చేసిన త‌ప్పుల‌కు జైల్లో పెట్టించారు. ఆ క‌క్ష‌తో చంద్ర‌బాబును జైల్లో పెట్టించ‌డం దారుణ‌మ‌న్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రాజ‌ధాని లేకుండా , స‌రైన పంపకాలు లేకుండా విభ‌జ‌న జ‌రిగింద‌ని, ఆస‌మ‌యంలో ఎన్నిక‌ల్లో పోటి చేయ‌కుండా టిడిపికి మ‌ద్ద‌తిచ్చానన్నారు. 2024లో టిడిపి-జ‌న‌సేన ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.