యాదగిరిగుట్ట టీఆర్ఎస్ పార్టీ ప‌ట్ట‌ణాధ్య‌క్షుడిగా పెలిమెల్లి శ్రీ‌ధ‌ర్ గౌడ్‌

యాద‌గిరి గుట్ట‌ (CLiC2NEWS): యాద‌గిరిగుట్ట మండ‌ల కేంద్రంలో మంగ‌ళ‌వారం జ‌రిగిన యాద‌గిరి గుట్ట తెలంగాణ రాష్ట్ర స‌మితి (టిఆర్ ఎస్) ప‌ట్ట‌ణ క‌మిటీ ఎన్నిక‌లు నిర్వ‌హించారు. ఈ ఎన్నిక‌ల్లో ప‌ట్ట‌ణ అధికార టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడిగా పెలిమెల్లి శ్రీ‌ధ‌ర్‌గౌడ్ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు.  ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ డిసిసిబి చైర్మ‌న్ గొంగిడి మ‌హేంద‌ర్‌రెడ్డి స‌మ‌క్షంలో పార్టీ ప‌ట్ట‌ణ క‌మిటీ, అనుబంధ విభాగాల క‌మిటీల‌ను ఎన్నుకున్నారు. కాగా రెండు సార్లు వార్డు స‌భ్యుడిగా, యాదాద్రి ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త‌గా కూడా శ్రీ‌ధ‌ర్ గౌడ్ ప‌నిచేశారు.

అలాగే ప‌ట్ట‌ణ టీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షునిగా ముఖ్యర్ల సతీష్ యాదవ్, ప‌ట్ట‌ణ టీఆర్ఎస్ పార్టీ యూత్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా శివ‌రాత్రి మ‌హేశ్ ఎన్నిక‌య్యారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మండల టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు , యువజన విభాగం నాయకులు, విద్యార్థి విభాగం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికైన వారంద‌రికీ శుభాకాంక్ష‌లు..

మంజుల పత్తిపాటి
(ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ )

ఈ ఎన్నిక‌ల‌లో ఎన్నుకోబ‌డిన నాయ‌కుల‌కు ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా మంజుల క్లిక్‌2న్యూస్‌తో మాట్లాడుతూ..

“యాద‌గిరి గుట్ట ప‌ట్ట‌ణ టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడిగా ఎన్నికైన పెలిమెల్లి శ్రీ‌ధ‌ర్‌గౌడ్ కు, అలాగే ప‌ట్ట‌ణ టీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షునిగా ఎన్నికైన ముఖ్యర్ల సతీష్ యాదవ్, ప‌ట్ట‌ణ టీఆర్ఎస్ పార్టీ యూత్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఎన్నికైన శివ‌రాత్రి మ‌హేశ్ ల‌కు శుభాకాంక్ష‌లు.. వీరితో పాటు టిఆర్ ఎస్ ప‌ట్ట‌ణ క‌మిటీ ఎన్నిక‌లలో ఎన్నుకోబ‌డిన ప్ర‌తి ఒక్క‌రికి పేరుపేరునా శుభాకాంక్షలు“ అని మంజుల ప‌త్తిపాటి తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.