పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు

నరసరావుపేట (CLiC2NEWS): ఇవిఎంల ధ్వంసం.. కేసులో మాజి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నరసరావుపేటలో పోలీసులు అరెస్టు చేశారు. నరసరావు పేట ఎస్ కార్యాలయంలో ఉన్న ఆయనను మాచర్ల కోర్టుకు తరలించనున్నారు. ఇవిఎంల ధ్యంసం, అడ్డుకున్నవారిపై దాడి కేసులో మాచర్ల మాజి ఎమ్మెల్యే పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో పోలీసులు అయనను అరెస్టు చేసినట్లు సమాచారం.
ఎపిలో పోలింగ్ రోజు పాల్వయిగేటు పోలింగ్ బూత్‌లో పిన్నెల్లి ఇవిఎంలను బద్లలుకొట్టడం, అడ్డుకున్నవారిపై చేయిచేసుకోవడం పై ఆయనపై కేసు నమోదైంది. అయితే పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణలు జరపగా.. ధర్మాసనం ముందస్తు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో పోలీసులు పిన్నెల్లిని అరెస్టు చేశారు.