దసరా నాటికి అన్ని ఆలయాల్లో జమ్మి మొక్కలు..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలోని అన్ని దేవాలయాలలో జమ్మిచెట్లు నాటాలని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. ‘ఇంటింటికి జమ్మిచెట్టు, గుడి గుడిలో జమ్మిచెట్టు’ కార్యక్రమంలో భాగంగా ఎంపి సంతోష్‌కుమార్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రెండో విడత కార్యాక్రమాన్ని జమ్మిమొక్క నాటి ప్రారంభించారు . ఈ సందర్భంగా దసరా పండుగ నాటికి ఆలయాలలో జమ్మి వృక్షాలు నాటాలని, వాటితోపాటు పూలమోక్కలు నాటాలని సూచించారు. ఈ మొక్కల పరిరక్షణ బాధ్యత సంబంధిత కార్యనిర్వహణ అధికారలదే అని స్పష్టం చేశారు.