అంతర్ జిల్లా దొంగల ముఠాను పట్టుకున్న పెద్దపల్లి పోలీసులు

రూ. 18,13,600/- లక్షల విలువ గల సొత్తు స్వాధీనం.

పెద్ద‌పెల్లి (CLiC2NEWS): అంతర్ జిల్లా దొంగల ముఠాను పెద్ద‌పెల్లి పోలీసులు ప‌ట్టుకున్నారు. శ‌నివారం పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి ఆధ్వర్యంలో పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్, ఎస్సై రాజేష్ లు అనుమానాస్పదంగా పైడ బజార్ ఏరియా లో విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు కొంతమందిని పట్టుకొని విచారించగా గతంలో దొంగతనం చేసినటువంటి బంగారు నగలను, వెండి నగలు, వస్తువులను అమ్మడానికి పెద్దపల్లిలోని పైడ బజార్ కు వచ్చామని తెలిపారు. దాంతో ఆ ముఠాకు చెందిన వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. అనంతరం విచారణ లో వారు దొంగతనాల్లో వాటాకు వచ్చిన బంగారు నగలు, వెండి వస్తువులు, నగదు రూపాయలు మ‌రిన్ని వస్తువులు మా ఇంట్లో ఉన్నాయని తెలిపారు. ముఠా దొంగతనాలు చేయుటకు ఆటో నెం.TS-01-UB-1596 ను ఉపయోగించామని విచార‌ణ‌లో తెలిపారు.

పోలీసులు స్వాధీనపరుచుకున్న వాటి వివరాలు

  •   71- గ్రాముల బంగారం,
  • 1280 గ్రాముల వెండి
  •  నగదు రూ. 68,000/-
  •  04- రిఫ్రిజిరేటర్లు
  •  02- సిలిండర్లు
  •  01-గ్యాస్ స్టవ్
  •  35 పట్టు చీరలు
  •  పాఠశాల వస్తువులు
  •  01- మైక్రో ఓవెన్
  •  కంప్యూటర్ వస్తువులు ఇతర వస్తువులు
    పేన పేర్కొన్న వాటి విలుల సుమారు రూ.18,13,600/- ఉంటుంద‌ని అంచ‌నా వేశారు.

అంతర్ జిల్లా ముఠాను పట్టుకోవడంలో చాకచక్యంగా పనిచేసిన పెద్దపల్లి ఎస్ఐ రాజేష్, ఎస్ఐ పోచయ్య, సిబ్బంది దుబాసి రమేష్, మాడిశెట్టి రమేష్ మరియు రవి లకు నగదు రివార్డు అందించడం జరిగింది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లో పెద్దపల్లి డిసిపి రవీందర్, ఏసిపి సారంగపాణి, సిఐ లు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్ ఎస్సై రాజేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.