ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు
గోదావరిఖని (CLiC2NEWS): జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోదావరిఖనిలోని గాంధీనగర్‌కు చెందిన వ్యక్తి గత కొద్దికాలంగా కుటుంబ గొడవలుతో విసిగిపోయి బుధవారం రాత్రి గోదావరిఖని 1టౌన్ సిఐ రమేష్ బాబుకు ఫోన్ చేసి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. సిఐ రమేష్ ఆ వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతూ.. రెండవ సిఐ రాజ్‌కుమార్ గౌడ్‌తో కలిసి గోదావరి నదివద్ద వెతికారు. అక్కడ కనిపించకపోయే సరికి అతని ఇంటికి వెళ్లి చూడగా.. చీరతో ఉరివేసుకొని వేలాడుతున్నాడు.
వెంటనే సీఐ రమేష్ బాబు, రాజ్ కుమార్ గౌడ్ ఆ ఇంటి తలుపులు పగులకొట్టి అతనిని కిందికి దింపి, స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందించారు.