Mancherial: యువతకి వాలీబాల్, క్రికెట్ కిట్స్ అందజేసిన పోలీసులు
మంచిర్యాల (CLiC2NEWS): సంఘ విద్రోహ శక్తులకు సహకరించవద్దని, యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్ఐ విజేందర్ అన్నారు. మంచిర్యాల జిల్లాలోని దేవాపూర్ పోలీస్‌స్టేషన్ పరిదిలోని అచ్యుతరావు గూడ, గట్టురావు పల్లెకు చెందిన యువతకు వాలీబాల్, క్రికెట్ కిట్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏదైనా సమస్య ఉంటే పోలీసులకు తెలిజేయాలని సూచించారు. ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ ను సద్వినియోగం చేసుకోవాలని, మందమర్రి, బెల్లంపల్లి, మంచిర్యాల ప్రాంతాలలో ఉచిత కోచింగ్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. యువత తమ వివరాలు తెలిపితే ఉచిత కోచింగ్ కోసం పోలీస్ వారి సహకారం అందించడం జరుగుతుందన్నారు. ఒకప్పుడు మావోయిస్టుల ప్రభావం వలన పోలిస్ ఉద్యొగం చెయ్యడానికి ముందుకు రాకపోవడం జరిగేది. కాని, ఇప్పుడు ఎజెన్సీ , మావోయిస్టు ప్రభావిత మారుమూల గ్రామాలనుండి యువత పోలిస్ ఉద్యోగం చేయాలని పట్టుదలతొ రావడం జరుగుతుందన్నారు.