నగరంలో భారీగా నగదు పట్టివేత..

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని బంజారాహిల్స్‌లో రూ.2.4కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం ఉదయం వాహనాలను తనిఖీ చేస్తుండగా.. ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ. 2.4 కోట్ల నగదును గుర్తించారు. నగదుకు సంబంధించి ఎటువంటి వివరణ ఇవ్వకపోవటంతో కారులోని వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా గత పది రోజుల వ్యవధిలో రూ. 10 కోట్ల హవాలా సొమ్ము పట్టుబడింది.
For my thesis, I consulted a lot of information, read your article made me feel a lot, benefited me a lot from it, thank you for your help. Thanks!