పోరుగల్లుకు.. ఓరగల్లుకు.. వరంగల్లుకు వందనం: సిజెఐ ఎన్వీ రమణ

వరంగల్ (CLiC2NEWS):వరంగల్ నగరంతో తనకున్న అవినాభావ సంబంధాన్ని వెల్లడించారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.
హనమకొండలోని 10 కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంబించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కోళోజీ స్ఫూర్తితో తెలుగులో మాట్లాడుతున్నానని తెలిపారు…
“తెలుగు వాడివై తెలుగు రాదనుచు సిగ్గులేక ఇంకా చెప్పుటెందుకురా.. అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంటు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా..“ అని అన్న కాళోజీ స్ఫూర్తితో ఈ రోజు తెలుగులో మాట్లాడేందుకు సాహసిస్తున్నాను. కవులు, స్వాతంత్ర్య పోరాట యోధులు, యోధులు, విప్లవకారలు తిరిగిన నేల ఓరుగల్లు. వరంగల్‌తో నాకు అవినాభావ సంబంధం ఉంది. గతంలో ఇక్కడ జరిగిన 3 సాహిత్య కార్యక్రమాలకు హాజరయ్యాను. ఇక్కడ నాకు బంధువులు, మిత్రులు ఉన్నారు.
.. నా తెలంగాణ కోటి రరతనాల వీణ అన్నారు దాశరథి. ఆయన గర్జన పరపీడన విముక్తికి, పోరాటాలకు ఊపిరినిచ్చింది. పోరుగల్లుకు.. ఓరుగల్లుకు.. వరంగల్లుకు వందనం.. రామప్ప క్షేత్రాన్ని సందర్శించి మురిసి పోయా..“ అని పేర్కొన్నారు.