ఎపి వరద బాధతులకు ప్రభాస్ భారీ విరాళం

అమరావతి(CLiC2NEWS): ఆంధ్రప్రదేశలోని వరద బాధితులకు పభాస్ కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు. ఇటీవల ఎపిలో కురిసిన వర్షాలు, వరదలు కారణంగా అనేక మంది ప్రజలు నిరాశ్రయులైనారు. వారికి సినీ ప్రముఖులు తమవంతు సాయం ప్రకటించిన విషయం తెలిసినదే. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రూ. కోటి విరాళం సిఎం రిలీఫ్ ఫండ్‌కు పంపనున్నారని ప్రకటించారు. కరోనా సమయంలో కూడా ప్రభాస్ తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు, ప్రధానమంత్రి సహాయనిధికి రూ.3కోట్లు విరాళం ఇచ్చిన విషయం తెలిసినదే.