దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా మహమ్మారి కేసులు భారీగా తగ్గాయి. 558 రోజుల కనిష్ట స్థాయికి చేరాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 6,822 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు మంగళవారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది.
గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 10.004 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారిన పడి కొత్తగా 220 మంద్రి మృతి చెందారు.
తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,46,48,383 కి చేరింది. వీటిలో ఇప్పటి వరకు 3,40,79,612 మంది కోలుకున్నారు.
తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు దేశంలో 4,73,757 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 95,014 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.