తెలంగాణ నుండి ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు రాష్ట్రపతి పతకాలు
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రానికి చెందిన ఇద్దరు పోలీసు అధికారులకు రాష్ట్రపతి పోలీస్ మెడల్స్‌ను కేంద్రం ప్రకటించింది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్‌పి దేవేంద్ర సింగ్‌లకు రాష్ట్రపతి పోలీసు పతకాలను ప్రకటించింది. వీరితోపాటు మరో 12 మందికి ఇండియన్ పోలీసు పతకాలు కేంద్రం ప్రకటించింది. మెడల్స్ పొందిన పోలీసు అధికారులకు డిజిపి మహేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.