యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రైవేటు బస్సు, టిప్పర్ ఢీ..

చౌటుప్పల్ (CLiC2NEWS): యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌లో ప్రైవేటు బస్సు, టిప్పర్ ఢీ కొన్న ఘటన చోటుచేసుకుంది. లక్కారం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో 15 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కాకినాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనతో విజయవాడ-హైదరాబాద్ రహదారిపై 2 కి.మీ. ట్రాఫిక్ నిలచిపోయింది. పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించిన ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.