చిలుకూరు బాలాజి ఆలయాన్ని దర్శించుకున్న ప్రియాంక చోప్రా
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రముఖ నటి ప్రియాంక చోప్రా నగరంలోని చిలుకూరు బాలాజి స్వామిని దర్శించుకున్నారు. ఆమె లాస్ ఏంజెల్ నుండి కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. ఆలయంలో దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. బాలాజి ఆశీస్సులతో కొత్తప్రయాణం మొదలు పెడుతున్నట్లు పేర్కొన్నారు. తన కొత్త సినిమాని ఉద్దేశించి పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది. మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రంలో ప్రియాంకను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికోసమే హైదరాబాద్ వచ్చి ఉంటారని.. అదే కొత్త ప్రయాణం కావొచ్చని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
నెటిజన్లు