Ramagundam: ప్రొ. జయశంకర్ జయంతి వేడుకలు

రామగుండము (CLiC2NEWS): ప్రత్యేక రాష్ట్ర సాధనకు జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని ఇంచార్జ్ అడ్మిన్ ఎసిపి మల్లారెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఈరోజు రామగుండము పోలీసు కమీషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎసిపి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను యావత్ ప్రపంచానికి చాటి చెప్పార‌న్నారు. అంతేకాక‌, సిద్ధాంతకర్తగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం జ‌య‌శంక‌ర్‌ తన జీవిత కాలం రాష్ట్ర సాధనకే త్యాగం చేశారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఎన్నో ఉద్యమాలు 1969 తెలంగాణ ఉద్యమం, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కీ ఉద్యమం మ‌రియు మలిదశ తెలంగాణా ఉద్యమం లో పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా వేదికల ద్వారా తన ప్రసంగాలతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి ఎలుగెత్తి చాటారు ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పి ఉద్యమ స్ఫూర్తితో ప్రజలను చైతన్యం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన జీవితం నేటి యువ‌త‌కు ఆద‌ర్శప్రాయం మ‌రియు స్ఫూర్తిదాయకమన్నారు.

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, ఏఓ శ్రీనివాస్ , ఇన్స్పెక్టర్ లు చంద్ర శేఖర్ గౌడ్, భీమేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్, దామోదర్, మల్లేషం,వామన్ మూర్తి సూపరింటెండెంట్ లు ఇంద్ర సేనా రెడ్డి, సందీప్, సంధ్య, సీసీ హరీష్ సిపిఓ సిబ్బంది , వింగ్స్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Also Read:  అసిస్టెంట్ ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ పోస్టులు

1 Comment
  1. […] Ramagundam: ప్రొ. జయశంకర్ జయంతి వేడుకలు […]

Leave A Reply

Your email address will not be published.